
ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. ఇంటికి ఏర్పాటు చేసిన గ్రిల్స్‌లో చిక్కుకుపోయాడు. తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సఫలం (Thief gets stuck) కాలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆఫీసుల్లోని స్క్రాప్‌ విక్రయంతో రూ.5,100 కోట్ల ఆదాయం: కేంద్రం నగరంలోని రాజారాంనగర్‌ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇది చూసిన జనం స్థానికంగా గుమిగూడారు. అతడిని రక్షించడం పక్కనపెడితే.. దొంగతనానికి వచ్చినట్లు అనుమానించి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసులకు చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అయితే, పది రోజుల కింద జరిగిన ఘటనగా తేల్చారు. యజమానిని సంప్రదించగా.. ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు, ఆభరణాలు లేవని పోలీసులకు వివరించాడు. మరోవైపు నిందితుడి వివరాలు కూడా తెలియరాలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




