
ఇనుగుర్తి: మండల కేంద్రంలో సోమవారం రాత్రి పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 8 మందిని గాయపరిచింది. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని అకస్మాత్తుగా దాడి చేసింది. గంజి వీరేందర్‌రెడ్డి, గట్టిగొర్ల సందీప్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్క దాడి చేసి కరిచింది. మేచరాజు పల్లి గ్రామానికి చెందిన వీరయ్య బంధువుల ఇంటికి వచ్చి బయటకు వెళ్తున్న సమయంలో అతడిపైనా దాడి చేసి గాయపరిచింది. అలాగే స్థానికులు రాజు, భరణి, రాజేష్‌, మల్లన్న, నవీన్‌లను కూడా కరిచినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి 108 సిబ్బంది ఈఎంటీ ప్రభాకర్‌ ప్రథమ చికిత్స అందించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా బాధితులు ఇనుగుర్తి పీహెచ్‌సీలో చికిత్స పొందారు. వీధికుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




