
నేలకొండపల్లి గ్రామీణం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు ఏపీలోని గండ్రాయి వద్ద పొలంలో తన కూతురు లాస్య, కుమారుడు నిఖిల్‌కు కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించాడు. అనంతరం తాను సైతం తాగాడు. దీంతో శ్రీనివాసరావు, కూతురు లాస్య మృతిచెందగా, కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వీరి బలవన్మరణం చేసుకోవడానికి కారణాలు తెలియారాలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.