అలాస్కా తీరంలోని బెరింగ్ సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటనలో 15 ఏళ్ల డెరెక్ పార్కర్ అఘ్నాంగా అనే బాలుడు 62 గంటల పాటు పోరాడి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో మునిగి చనిపోయిన తన అన్న, బావ మృతదేహాలు కొట్టుకుపోకుండా గంటల తరబడి పట్టుకున్న ఆ బాలుడు.. చివరికి తీవ్ర నీటి ఉధృతితో వారిని వదిలేశాడు. ఆ తర్వాత కూడా గంటలపాటు ఒంటరిగా పోరాడుతూ నరకయాతన అనుభవించాడు. కోస్ట్ గార్డ్ అధికారులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.




