
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్‌ (28), అతడి భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో మృతి చెందారు. మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన ఈ దంపతులు.. వకీల్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని తోటి కూలీలకు చెప్పారు. దీంతో వారిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో అజయ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దినేశ్వరి కూడా కన్నుమూసింది. దంపతుల అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



