
ప్రేమ జీవితానికి, ప్రేమ పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ జీవితం ప్రారంభం అవుతుంది. ప్రేమ ప్రయత్నాలు సఫలమవు తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. వచ్చే ఏడాది జనవరి 2 వరకు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల ఇవన్నీ వెలుగు చూస్తాయి. కొన్ని రాశుల వారికి ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ ప్రేమ జీవితం ప్రారంభం కావడం, అది పెళ్లికి దారితీయడం జరుగుతుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి శుక్ర సంచారం వల్ల ప్రేమ యోగం పట్టే అవకాశం ఉంది.


