
సూరత్: చోరీ చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుకవైపు ఉన్న గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నానా తంటాలు పడుతుండగా స్థానికులు అతడిని గమనించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది.




