
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ పావురం తీవ్ర కలకలం రేపింది. దాని కాలికి ఉన్న ట్యాగ్పై బంగ్లాదేశ్ను పోలిన నంబర్ ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు.
© 2026 nimisham.in

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ పావురం తీవ్ర కలకలం రేపింది. దాని కాలికి ఉన్న ట్యాగ్పై బంగ్లాదేశ్ను పోలిన నంబర్ ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు.
కాలికి ఉన్న ట్యాగ్‌పై బంగ్లాదేశ్‌ను పోలిన కోడ్‌ గుర్తింపు పట్టుబడ్డ పావురం, ట్యాగ్‌పై కోడ్‌ రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఓ పావురం తీవ్ర కలకలం రేపింది. దాని కాలికి ఉన్న ట్యాగ్‌పై బంగ్లాదేశ్‌ను పోలిన నంబర్‌ ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు. బైసింగా పోలీసుస్టేషన్‌ పరిధి కాశీపొడ గ్రామానికి చెందిన హరీష్‌ చంద్ర పుహాన్‌ అనే వ్యక్తి ఇంటి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ పావురం వాలింది. దాని కాలికి నీలం రంగులో ఓ ట్యాగ్‌ ఉన్నట్లు హరీష్‌ కుటుంబీకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని పరిశీలించగా బీఏఎన్‌-2024 అని దాని కింద 701831 నంబర్‌ రాసి ఉన్నట్లు తేల్చారు. బీఏఎన్‌ అని రాసి ఉండటంతో బంగ్లాదేశ్‌కు చెందినట్లు అనుమానిస్తున్నారు. పావురాన్ని అదుపులోకి తీసుకొని కోడ్‌ అర్థాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు బెట్నోటి ఎస్డీపీఓ మినాతి బిశ్వాల్‌ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








