
© 2026 nimisham.in

KCR | నర్సింహులపేట సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్ర పటానికి గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుగగులోతు రవి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ 6 శాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అదేవిధంగా చిన్న చిన్న తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాలకు వారే సర్పంచు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కైల, ఉప సర్పంచ్ కిషన్ నాయక్. బీఆర్ఎస్ మండల అధ్యక్షుఉ మలోత్ వెంకన్న, వార్డు సభ్యులు రవి. కవిత ఉదయ్ లత రెడ్డి, శ్రీను మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ వీర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






