
మాకు పెళ్లై రెండేళ్లు. ఇంకా పిల్లలు లేరు. నాకు ఎక్కువగా నైట్ షిఫ్ట్లే ఉంటాయి. దాని ప్రభావం కూడా ఉంటుందా? మాకు పెళ్లై రెండేళ్లు. ఇంకా పిల్లలు లేరు. నాకు ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌లే ఉంటాయి. దాని ప్రభావం కూడా ఉంటుందా? ఈ నైట్‌ షిఫ్ట్‌లు, డే షిఫ్ట్‌లు వంటివి ప్రెగ్నెన్సీ మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే, మన శరీరం ఒక హార్మోనల్‌ రిథమ్‌కి అలవాటు పడుతూ ఉంటుంది. మనకి ప్రతి నెలా పీరియడ్‌ వస్తుంటుంది కదా! అది అలా రావాలంటే ఒక సైకిల్‌ పూర్తవ్వాలి. అంటే... 30 రోజులు అవ్వాలి. ఆ సమయంలో మన శరీరానికి ఇది ఉదయం, ఇది రాత్రి అని ఒక ఫీడ్‌బ్యాక్‌ వెళ్తుంది. దీన్నే బయోలాజికల్‌ ఫీడ్‌బ్యాక్‌ సిస్టమ్‌ అంటారు. ఇది బాగుంటే హార్మోన్ల వ్యవస్థ సరిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో హార్మోన్ల వ్యవస్థ సరిగా ప్రతిస్పందించదు. దీని తాలూకు దుష్ఫలితాలు కొంతమందికి పైకి కనిపిస్తాయి. మరికొంతమందికి అంతర్లీనంగా హార్మోన్లలో తేడా వస్తుంది. దీనివల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం విడుదలలో మార్పులు రావడం, సంతానలేమి సమస్యలు... వంటివి వస్తాయని తాజా పరిశోధనల్లోనూ తేలింది. కాబట్టి, భార్యాభర్తల్లో ఒకరు డే షిఫ్ట్‌ చేయడం, ఇంకొకరు నైట్‌ షిఫ్ట్‌ చేయడం వల్ల ముందు కలవడానికే సమయం ఉండదు. ఒకవేళ కలిసినా, నిద్ర వేళలు క్రమం తప్పడంవల్ల అండం విడుదలలో మార్పులొస్తాయి. దీనివల్ల శరీరం గర్భధారణకి సహకరించకపోవచ్చు. ఒకవేళ వాళ్ల జీవనశైలి ప్రతిరోజూ ఒకేలా ఉంది అంటే, శరీరం దానికి అలవాటు పడుతుంది. కానీ, వారానికోసారి షిఫ్ట్‌లు మారుతుంటే మాత్రం శరీరంలో బయోలాజికల్‌ ఫీడ్‌బ్యాక్‌ దెబ్బతింటుంది. కాబట్టి, ముందు మీరు కచ్చితమైన నిద్రవేళలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. వ్యాయామం చేస్తూ సమతులాహారం తీసుకోవాలి. అండం విడుదలయ్యే సమయాన్ని లెక్కించుకుని కలవాలి. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings




