© 2026 nimisham.in
ధ్యానంలో కూర్చుని లోతైన శ్వాస (పొత్తి కడుపు నుంచి) తీసుకుంటూ వదలడం ద్వారా వేగస్ నాడి క్రియాశీలకంగా మారుతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. శరీరంలో ప్రధానమైన ఈ వేగస్ నాడి బలంగా ఉండేందుకు రోజూ ఈ ధ్యానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజూ 15-20 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి నరాలకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. తద్వారా నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజులో అప్పుడప్పుడూ బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటే కండరాలు, నరాలు బలంగా మారతాయి. ముఖ్యంగా మెడ, వెన్నెముక, కాళ్లు, చేతులు స్ట్రెచ్ చేయడం చాలా మంచిది. రెసిస్టెంట్ బ్యాండ్ ఉపయోగించే చేసే వ్యాయామాలు నరాలకు తగినంత బలాన్ని ఇస్తాయి. అందుకే రెగ్యులర్గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే నరాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది. నరాలకు తగినంత బలం లభిస్తుంది. ముఖ్యంగా వృక్షాసనం, అధోముఖ స్వనాసనం వంటి ఆసనాలు వేస్తే నరాల బలహీనత తగ్గించుకోవచ్చు. నేలపై పడుకుని కాళ్లను నెమ్మదిగా ఎత్తుతూ ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగిన నాడీ వ్యవస్థ బలపడుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా సెంట్రల్ నాడీ వ్యవస్థ, మెదడు చురుకుగా మారుతాయి. దీంతో నరాల బలహీనత కూడా తగ్గుతుంది. చైనా సంప్రదాయ వ్యాయామ పద్ధతి తై చి. ఈ వ్యాయామం రోజూ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకోవడం ద్వారా వేగస్ నాడీ యాక్టివేట్ అవుతుంది. దీంతో నరాలు చురుకుగా పనిచేస్తాయి.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Help others stay updated with verified breaking news and insights.