
నడవాలన్నా, పరిగెత్తాలన్నా, చివరికి గుండె కొట్టుకోవాలన్నా వెనుక ఉండే అసలైన ఇంజిన్ కండర కణజాలం. అదే విధంగా వేడి వస్తువును తాకిన వెంటనే రెప్పపాటులో చేతిని వెనక్కి లాక్కోవడంలో సూత్రధారి నాడీ కణజాలం.
నడవాలన్నా, పరిగెత్తాలన్నా, చివరికి గుండె కొట్టుకోవాలన్నా వెనుక ఉండే అసలైన ఇంజిన్‌ కండర కణజాలం. అదే విధంగా వేడి వస్తువును తాకిన వెంటనే రెప్పపాటులో చేతిని వెనక్కి లాక్కోవడంలో సూత్రధారి నాడీ కణజాలం. సజీవ దేహాన్ని ఒక అధునాతన యంత్రంగా భావిస్తే, దానికి చలన శక్తిని ఇచ్చే మోటార్లుగా కండరాలు, నడిపించే కంట్రోల్‌ రూమ్‌గా నాడీ వ్యవస్థ పనిచేస్తాయి. కండరాల సంకోచ వ్యాకోచాల్లోని సైన్స్, క్రాంప్స్‌ వెనుక ఉన్న కారణాలు, విద్యుత్తు వేగంతో సమాచారాన్ని మోసుకెళ్లే నాడీ కణాల అద్భుత నిర్మాణాన్ని పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంక్లిష్టమైన జంతు శరీరంలో అంతర్గత సమన్వయం సాగే తీరును అర్థం చేసుకోవడానికి ఈ భావనలు పునాదులుగా ఉపయోగపడతాయి. జంతు శరీర నిర్వహణలో నాలుగు ప్రధాన కణజాలాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందులో దేహానికి రక్షణ ఇచ్చే ఉపకళా కణజాలం, అవయవాలను అనుసంధానించే సంయోజక కణజాలం అంతర్గత స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ పునాది ఆధారంగా దేహాన్ని క్రియాశీలకంగా నడిపించే కండర, నాడీ కణజాల వ్యవస్థలు అత్యంత ముఖ్యమైనవి. శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా సమస్త శారీరక చలనాలను, అవయవ కదలికలను కండర కణజాలం సాధ్యం చేస్తుంది. ప్రేరణలను గ్రహించి విద్యుత్తు సంకేతాల ద్వారా మొత్తం శరీర వ్యవస్థలను క్షణాల్లో నాడీ కణజాలం నియంత్రిస్తుంది. నోట్‌: కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్‌ ఆమ్లం విడుదల అవుతుంది. దీని గాఢత ప్రభావం వల్ల కండరాల నొప్పికి గురవుతారు. దీనినే ‘క్రాంప్స్‌’ అంటారు. ఉదా: జీర్ణ, శ్వాస, విసర్జన వ్యవస్థల్లో ఉండే భాగాలు. మస్క్యులార్‌ డిస్ట్రోఫీ కండర సంబంధిత వ్యాధులు 3 రకాలు. ఎ) మస్క్యులార్‌ డిస్ట్రోఫీ: ఇది కండర క్షీణత వ్యాధి, జన్యు పరంగా సంక్రమిస్తుంది. బి) కండర గ్లానీ: కండరాలు నిరంతరం పనిచేయడం, ఆక్సిజన్‌ తగినంత లేకపోవడంతో జరిగే అవాయు శ్వాసక్రియలో విడుదలైన లాక్టిక్‌ ఆమ్లం వల్ల వచ్చే కండర నొప్పి. సి) టిటానీ: కండర సంకోచ, సడలికలో సమతుల్యత వల్ల బిగుసుకుపోయే లక్షణం. చేతులను వేడి/ చల్లని నీటిలో ముంచినప్పుడు... నీరు వేడిగా/ చల్లగా ఉందని చెప్పగలగడానికి కారణం ఈ నాడీ కణజాలాలే.... శరీరంలో నాడీకణం ప్రత్యేకత: ఇది అతి పొడవైంది (90-100 సెం.మీ.) కణ విభజన సామర్థ్యం లేనిది. విధి: సమాచార ప్రసరణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సమాచార ప్రసరణలో ప్రముఖ పాత్ర పోషించే అయాన్లు: రీ, వ్చి. రసాయనాలు: డోపమైన్, హిస్టమైన్, ఎసిటైల్‌ కొలైన్‌. నోట్‌: శరీరంలో సమాచార వేగాన్ని పెంచగలిగే రసాయనిక పదార్థం-డోపమైన్‌. నాడీకణ నిర్మాణం: నాడీ కణాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి 1) కణదేహం (సెల్‌బాడీ)




