
బ్లాక్ కాఫీ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని JNS అధ్యయనం పేర్కొంది. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది కాలేయంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది. కాఫీలో ఉండే పారాక్సాంథిన్ అనే రసాయనం కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోకుండా మందగింపజేస్తుంది. అలాగే బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయంలో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. లివర్ ఫైబ్రోసిస్ ముప్పును తగ్గిస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు పెరిగే ఎంజైమ్‌లను స్థాయిలను తగ్గించడంలో కాఫీ తోడ్పడుతుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. కాఫీ తాగేవాళ్లు చక్కెర, పాలు, క్రీమ్ కలపకుండా కేవలం బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. చక్కెర, పాలు కలిపితే ప్రయోజనం ఉండదు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం కాలేయ ఆరోగ్యానికి శ్రేయస్కరం. అల్లం, పసుపు టీ ఫ్యాటీ లివర్ సమస్యను నివారించడంలో, కాలేయంలోని వాపును తగ్గించడంలో అద్భుతమైన సహజ పానీయంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్, పసుపులో కుర్య్కుమిన్ అనే క్రియాశీల పదార్థాలు కాలేయ పునరుజ్జీవనానికి దోహదపడతాయి. పసుపు, అల్లం రెండింటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ వల్ల కాలేయంలో ఏర్పడే వాపును, వాపు వల్ల కలిగే నష్టాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఇక అల్లం శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కాలేయంలో అనవసరపు కొవ్వు నిల్వలు పెరగకుండా పేరుకుపోయిన కొవ్వు కరిగేలా ప్రేరేపిస్తుందని IMJTFH అధ్యయనం పేర్కొంది. ఇక పసుపులోని కుర్క్యుమిన్ కాలేయ కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి, హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇక అల్లం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక పసుపు, అల్లం కాలేయంలో పిత్త రసం ఉత్పత్తిని పెంచడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేసి కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతాయి. ఒక కప్పు నీటిని మరగించి అందులో చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాలు మరగనివ్వాలి. ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి కలపాలి. దీనిని రోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఒక కప్పు తాగొచ్చు. అయితే పిత్తాశయంలో రాళ్లు ఉండే వాళ్లు, రక్తాన్ని పలచబరిచే మందులు వాడే వారు, తీవ్రమైన అసిడిటీ ఉన్న వారు ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలనుకునే ముందు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నియంత్రణలోకి రావడానికి, కాలేయ పనితీరు మెరుగుపడటానికి సహాయ పడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్-సీ, నారింగెనిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాలేయ కణాల్లో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, కాలేయం దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఇక నిమ్మరసం శరీరంలో గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ తయారీకి సహాయపడుతుంది. ఇది కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి డిటాక్సిఫికేషన్‌కు తోడ్పడుతుంది. ఇక నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ కాలేయంలో పిత్త రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పిత్త రసం పెరిగితే ఆహారంలోని కొవ్వులు వేగంగా అరిగి కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలపడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమైన శరీరం కొవ్వును కరిగించే వేగం పెరుగుతుంది. ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం అధిక బరువు. రోజూ ఉదయం ఇది తాగడం వల్ల బరువు తగ్గడానికి, పొట్ట వద్ద కొవ్వు కరగడానికి దోహదపడుతుంది. ఇక గోరువెచ్చని నిమ్మరసంలో కాస్త తేనె లేదా దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు. చక్కెర ఉపయోగించడం మంచిది కాదు. వెల్లుల్లి ఫ్యాటీ లివర్ తగ్గించడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో వెల్లుల్లి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, సల్ఫర్ పదార్థాలు కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. వెల్లుల్లి శారీరక బరువును, శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయంలో అనవసరమైన ఫ్యాట్ నిల్వలు పెరగకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ పదార్థాలు కాలేయంలోని టాక్సిన్లను తొలగించే ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇక వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, సెలీనియం కాలేయాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించి, కణజాలం దెబ్బతినకుండా చూస్తాయి. వెల్లుల్లి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే పరగడుపున 2 చిన్న వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి లేదా నలిపి నీటితో మింగవచ్చు. ముఖ్యంగా వెల్లుల్లిని తరిగిన తర్వాత 5-10 నిమిషాల్లో ఉంచితే దానిలోని అల్లిసిన్ క్రియాశీలమవుతుంది. వెల్లుల్లిని వంటకాల్లో, సూప్‌లు, సలాడ్లలో పచ్చి తురుమును చేర్చుకోవడం మంచిది. అయితే అసిడిటీ, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు రావచ్చు. రక్తం పలుచబడే మందులు వాడే వాళ్లు వెల్లుల్లి రోజూ తీసుకునేముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.




