
PMOS ప్రభావం పునరుత్పత్తి ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు. డాక్టర్ పి.వి. నిఖిత ప్రకారం ఈ పరిస్థితి ఇన్సులిన్ రెసిస్టెన్స్, కంట్రోల్లో లేని బ్లడ్ షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ అసమతుల్యత, పొత్తికడుపులో కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధిత ప్రమాదాలతో ముడిపడి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు కేవలం అధిక బరువు ఉన్న మహిళలకే పరిమితం కాదు. సాధారణ బరువు ఉన్న మహిళలు కూడా PMOSతో సంబంధం ఉన్న జీవక్రియ సంబంధిత ప్రమాదాల్ని ఎదుర్కోవచ్చు. ఈ సమస్య ఉన్న మహిళలు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వారి శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలు, లైఫ్‌స్టైల్ ఎలా ఉన్నాయో పరిశీలించడం చాలా ముఖ్యం.
Recommended for you

politicsమమకార రాహిత్యంలోనే శాశ్వతానందం



