
Danam Nagender: సుప్రీంకోర్టు తన అనర్హత వేటును సమర్థిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఊరట లభిస్తుందని ఆశించి లీగల్ పోరాటం చేశానని తెలిపారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని వేచి చూశానని, ఇది ఊహించిన పరిణామమేనని పేర్కొన్నారు. తీర్పు ఏదైనా తాము ప్రజాక్షేత్రంలోనే ఉంటామని, ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. No UPI





