
Jharkhand Accident: జార్ఖండ్ రాష్ట్రంలో వేకువజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. జంషెడ్పూర్ నగరంలోని సోనారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెరైన్ డ్రైవ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తెతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం