
బిగ్‌బాస్ ఫేమ్, నటి వర్షిణి వెంకట్‌ను (Varshini Venkat) పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకున్న కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్‌ఫిల్మ్ నిర్మిస్తానని చెప్పడంతో ఓ వ్యక్తి.. వర్షిణికి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తి అడిగాడు. దీంతో ఆగస్టు 22న సదరు వ్యక్తిని పిలిపించి దాడి చేసి రెండు సెల్ ఫోన్లు, 50 వేల నగదు ఆమె లాక్కొన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆ తరువాత ఫోన్ చేసి మరో 5 లక్షలు తీసుకున్నట్ల





