
నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.
© 2026 nimisham.in

నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.
నల్లబెల్లి : మండలంలోని లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల ప్రకారం.. విజయలక్ష్మి, తన భర్త రవీందర్‌తో కలిసి బుధవారం రాత్రి నర్సంపేట నుంచి లెంకాలపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఇటుకాలపల్లి–నారక్కపేట గ్రామాల మధ్య బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా మరో ద్విచక్ర వాహనం వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందారు. సర్పంచ్ విజయలక్ష్మి అకాల మరణంతో లెంకాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






