
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన తాజాగా ప్రారంభించిన 'వన్8' (One8) గ్లోబల్ బ్రాండ్ షూస్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర...
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన తాజాగా ప్రారంభించిన 'వన్8' (One8) గ్లోబల్ బ్రాండ్ షూస్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ బ్రాండ్ లాంచ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా లక్షన్నర (1.5 లక్షలు) జతల షూస్ అమ్ముడయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే రూ. 138 కోట్లకు పైగా భారీ ఆదాయం సమకూరినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఇక, టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన 9,230 పరుగులకు గుర్తుగా వీటి ధరను రూ. 9,230గా నిర్ణయించారు. అంతేగాక ఈ షూస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం లేదు. వేల రూపాయలు పెట్టి షూస్‌ను ప్రీ-బుక్ చేసుకున్న అభిమానులకే ఈవెంట్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అయినప్పటికీ, అభిమానుల నుంచి ఊహించని స్పందన లభించడం విశేషం.ఈ అమ్మకాల సునామీ విరాట్ కోహ్లీకి ఉన్న అసాధారణమైన క్రేజ్, బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రీడారంగంలోనే కాకుండా వ్యాపారంలోనూ కోహ్లీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.