
Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?

Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?

Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!

Business Ideas: ఇంట్లోనే బిజినెస్.. రూ.1,000 పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో సంపాదించే ఛాన్స్!

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది. టెర్నస్‌కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్‌లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి. సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి (Stock Market Today). మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి.. 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి.. 23,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ , విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది. నెలరోజుల గ్యాప్ తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. హర్మూజ్‌పై పట్టుకోసం ఇరాన్, అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Crude oil prices). బ్రెంట్ క్రూడ్ ప్యూచర్స్ ఒక బ్యారెల్‌కు 95.52 డాలర్లుగా ఉండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Car Sales: భారతీయ కార్ల మార్కెట్లో ఆగస్టు 2026 నెల సరికొత్త చరిత్రను తిరగరాసింది. పండుగల సీజన్ కంటే ముందే కస్టమర్లు కార్లను విపరీతంగా కొనుగోలు చేయడంతో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఊహించని రీతిలో భారీ వృద్ధిని నమోదు చేసి సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. దేశీయంగా అత్యధిక కార్లు విక్రయించే దిగ్గజం మారుతి సుజుకి ఆగస్టు నెలలో 2,19,220 వాహనాలను అమ్మి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశీయ మార్కెట్లో 1,80,078 ప్యాసింజర్ వాహనాలను విక్రయించడమే కాకుండా, విదేశాలకు 33,844 యూనిట్లను ఎగుమతి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లోనే ఏకంగా 10 లక్షల వాహనాల మార్కును దాటేసి తన బలాన్ని నిరూపించుకుంది. గతేడాది ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,76,971 కి చేరింది. మహీంద్రా ఎస్‌యూవీల దాటికి సరికొత్త రికార్డు మహీంద్రా కంపెనీ విక్రయాలు ఆగస్టు నెలలో ఏకంగా 42 శాతం వృద్ధి చెంది 1,07,648 వాహనాలకు చేరాయి. ఈ ఘనతలో కంపెనీ ఎస్‌యూవీల వాటా అత్యంత ముఖ్యం. గతేడాది ఆగస్టులో 39,399 ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 50 శాతం వృద్ధితో 59,257 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 61,167 యుటిలిటీ వాహనాలను అమ్మి మార్కెట్‌ను ఊపేసింది. టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 67,753 ప్యాసింజర్ వాహనాలను అమ్మి గతేడాది కంటే 56 శాతం భారీ వృద్ధిని సొంతం చేసుకుంది. ఇందులోనూ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు అగ్రభాగాన నిలిచాయి. కంపెనీ ఒకే నెలలో 16,549 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ఏకంగా 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా పెట్రోల్, డిజైన్ తో పాటు ఈవీల వైపు ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి టాటా మోటార్స్ గణాంకాలే ప్రధాన ఉదాహరణ. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆగస్టు

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్‌లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్‌గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్‌గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్‌లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్‌కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్‌లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Subash chandra | ఇంటర్నెట్‌డెస్క్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్నకు గానూ రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతించడంపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెల్లింపు విషయంలో త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్సీఎల్టీ నిలిపివేసింది. సుభాష్ చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా క్రెడిటర్లంతా కలిసి రూ.22,006.57 కోట్లు క్లెయిమ్ చేయగా.. కేవలం రూ.6.25 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఇటీవల ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికకు 80.81 శాతం క్రెడిటర్ల నుంచి ఆమోదం లభించడం గమనార్హం. అయితే, ఇందులో సుభాష్ చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న 5 సంస్థలు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నాయని, ఈ ప్రణాళిక ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రుణ చెల్లింపు ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఎన్సీఎల్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో త్రిసభ్య తీర్పును నిలిపివేయడంతో పాటు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్న ఆస్తులను ఎవరికీ బదిలీ చేయకూడదని ఆదేశించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Fuel Prices Hike| ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ (CNG) ధరలు పెరిగాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలో కూడా వరుసగా రెండోనెలలో పెంపు నమోదైంది. మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరను కేజీకి రూ.2 చొప్పున పెంచింది. దీంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. ఈ ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ధరలకు అనుగుణంగా ఈ ఇంధనాల రేట్లను సవరించినట్లు ఎంజీఎల్ వెల్లడించింది. రెండురోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా సీఎన్జీ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దాంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ గ్యాస్ ధర రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. సీఎన్జీ ధరలు పెరగడంతో ఆటో, ట్యాక్సీ సంఘాలు ప్రయాణ ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర లీటర్‌కు రూ.6.28 (5.46 శాతం) మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి పెరిగింది. ఈ మేరకు ఇండియన్ ఆయిలో కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుంది. దాంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. ఆగస్టు ఒకటిన ఏటీఎఫ్ లీటర్ ధర రూ.110 నుంచి 115కు పెరిగిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్‌ను క్లియర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్

LPG Price Hike: సెప్టెంబర్ నెల తొలిరోజే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం ఇల్లాళ్లకు ఊరటనిచ్చే విషయంగా మారింది. ఆగస్టు నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు, సెప్టెంబర్ 1న మళ్లీ పెంచి షాకిచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటన ప్రకారం 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.9.50 వరకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో అయితే రూ.11 మేర భారం పెరిగింది. గతేడాది చివరిలో ధరలు తగ్గినప్పటికీ, మళ్లీ పెరగడం వల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, టీ కొట్ల నిర్వాహకులకు రోజువారీ నిర్వహణ వ్యయం పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరా వ్యయాలు, రూపాయి మారకం విలువల్లో వచ్చే మార్పుల వల్లే ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగినప్పటికీ 14.2 కేజీల సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు తాకలేదు. సాధారణ ఇళ్లలో వాడే గ్యాస్ రేట్లు మునుపటిలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. 5 కేజీలు, 10 కేజీల చిన్న తరహా సిలిండర్ల ధరల్లోనూ ఎటువంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ రూ.349.50 వద్ద దొరుకుతుండగా, ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్ ధర రూ.339 వద్దే ఉంది. కాకపోతే 5 కేజీల గృహేతర వాణిజ్య సిలిండర్ రేటు రూ.762 నుంచి రూ.764 కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో లేటెస్ట్ రేట్లు ధరల పెంపు తర్వాత నగరాల వారీగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగరం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11 పెరిగి రూ.2,996 వద్దకు చేరి రూ.3,000 మార్కుకు అత్యంత చేరువైంది. దేశ

మనం చేసిన పని మరోసారి చేయాలంటే విసుక్కుంటాం. సణుక్కుంటాం.అవసరం అనుకుంటే తప్పదురా దేవుడా అని తలపట్టుకుని పూర్తి చేస్తాం. అలాంటిది ఓ దర్శకుడు ఒక సినిమాని ఇరవై ఏళ్ల పాటు నిరంతరం చెక్కుతూనే ఉంటారా? అదీ ఒక కొత్త సినిమా కాదు. అప్పటికే విడుదలైపోయి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, Hollywoodలో తన పేరును ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన సినిమా. అయినా దర్శకుడికి మాత్రం అది పూర్తయినట్టుగా అనిపించలేదు. అది కూడా ఏదో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన దర్శకుడు కాదు. ఒక సినిమా తీసి వెంటనే గ్యాప్ లేకుండా ఇంకో సినిమాకు వెళ్ళిపోయే సాధారణ filmmaker అంతకన్నా కాదు. Alien, Gladiator, Black Hawk Down లాంటి చిత్రాలతో ప్రపంచ సినిమాపై తన ముద్ర వేసిన Ridley Scott. అలాంటి దర్శకుడు ఒకే సినిమాను పట్టుకుని దాదాపు పావు శతాబ్దం పాటు మళ్లీ మళ్లీ చెక్కాడు. అంటే బోర్ కొట్టలేదా? లేదు! అక్కడే ఈ కథలో అసలు ఇంట్రస్టింగ్ విషయం ఉంది. 1982లో విడుదలైన ఈ sci-fi masterpieceకు, Ridley Scott తనకు కావాల్సిన తుది రూపాన్ని ఇవ్వడానికి 2007 వరకు పట్టింది. ఆ రూపమే ‘Blade Runner: The Final Cut’. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే Final Cut అమెరికాలో YouTubeలో adsతో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కానీ YouTubeలో ఉచితంగా దొరకడం అనేది ప్రక్కన పెడితే ..ఒక దర్శకుడు తన సినిమా విడుదలైపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా దాన్ని ఎందుకు వదల్లేదు? సినిమా పూర్తయింది.. కానీ దర్శకుడికి కాదు! Ridley Scott తెరకెక్కించిన Blade Runner ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దాని కథ భవిష్యత్తులోని Los Angeles నేపథ్యంలో సాగుతుంది. మనుషుల్లా కనిపించే Replicants అనే artificial beingsను భారీ కార్పొరేట్ సంస్థలు తయారు చేసి, శ్రమ కోసం ఉపయోగిస్తాయి. వాటికి పరిమిత జీవితకాలాన్ని నిర్ణయిస్తాయి

ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చాలా మందికి ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం లేదా కుటుంబ ఆస్తులను ఉపయోగించి స్థిరాస్తిలో పెట్టుబడి పెడతారు. అయితే, ఈ రంగంలో సరైన సమాచారం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాల నుంచి ఒకే ఆస్తిని పలువురికి అమ్మడం వరకు వివిధ రకాల మోసాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం. ఇది స్థిరాస్తిలో సాధారణంగా కనిపించే మోసాల్లో ఒకటి. మోసగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు, గుర్తింపు పత్రాలు లేదా ఇతర భూ రికార్డులను సృష్టించి ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు అసలు యజమాని సంతకాన్ని కూడా నకిలీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులు పత్రాలపై మాత్రమే ఆధారపడకుండా, సంబంధిత ప్రభుత్వ రికార్డుల్లో యాజమాన్య వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఒకే ప్లాట్ లేదా ఫ్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులకు విక్రయించే మోసాలు జరుగుతాయి. ముందస్తు బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లింపుల సమయంలో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు లేదా అపార్ట్మెంట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒప్పందం చేసుకునే ముందు ఆ ఆస్తిపై ఇప్పటికే ఇతర హక్కులు, ఒప్పందాలు లేదా రుణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. చౌక ధరకు ప్లాట్లు అందిస్తున్నామని చెప్పి అనుమతి లేని లేఅవుట్లను విక్రయించే సంఘటనలు కూడా కనిపిస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మించేందుకు అనుమతులు రాకపోవచ్చు లేదా అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై కూడా హామీలు మాత్రమే ఉండి, వాస్తవంగా అవి అందుబాటులో లేకపోవచ్చు

TikTok | ఇంటర్నెట్ డెస్క్: చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అమెరికా ప్రభుత్వంతో రాజీకొచ్చింది. ఇందుకుగాను ఆ దేశ న్యాయ విభాగానికి (US Justice Department) 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని రెండు దఫాలలో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో దాఖలైన ఈ వ్యాజ్యం ముగిసింది. టిక్‌టాక్ తమతో రాజీ చేసుకోవడం దేశంలోని పిల్లలు, తల్లిదండ్రులకు ఒక పెద్ద విజయమని అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ పేర్కొన్నారు. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించడం.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా యాప్‌లు గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని (children's privacy) సేకరించే ముందు, పిల్లల కోసం ఉద్దేశించిన యాప్‌లు, వెబ్సైట్లు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని నిర్దేశించే ఫెడరల్ చట్టాన్ని టిక్‌టాక్, దాని చైనా ఆధారిత మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ.. 2024లో న్యాయ శాఖ వ్యాజ్యం దాఖలు చేసింది. నాటి నుంచి టిక్‌టాక్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ (ByteDance) సంస్థ తన వాటాలను తగ్గించుకుంది. దీంతో కొత్త టిక్‌టాక్ యూఎస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ఒరాకిల్ (Oracle), సిల్వర్ లేక్, ఎమిరేట్స్ పెట్టుబడి సంస్థ ఎంజీఎక్స్ వంటి ప్రధాన పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకుంది. పిల్లల భద్రత, గోప్యతపై సోషల్ మీడియా కంపెనీలు పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న తరుణంలో టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవడం గమనార్హం. మరోవైపు 1998 నాటి బాలల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (COPPA)తో పాటు.. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు రావడంతో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా (Meta) సైతం కోర్టు విచారణలను ఎదుర్కొంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం స్పందించింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే వీటి ధరలు పెరిగాయనడం సరికాదని పేర్కొంది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణాలని స్పష్టం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. నిల్వలపై పరిమితులు విధించడంతోపాటు దిగుమతులపైనా సుంకాలు తగ్గించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్: ఎలాన్ మస్క్ దేశంలో జులై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20నాటికి అది రూ.55.70కు పెరిగింది. దీంతో ఇథనాల్ తయారీకి కోసం చక్కెర మళ్లించడం వల్లే ఈ ధరలు పెరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12శాతం ఉండగా.. 2025-26లో 9శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. అంచనాల కంటే తక్కువ దిగుబడి రావడం, పండగల వేళ డిమాండ్, పంట నష్టం, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, ఊహాగానాలతో కొంతమంది నిల్వలు పెంచడం, తదితర కారణాల వల్ల ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్.. మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెరుగుతోన్న చమురు ధరలు వంటి కారణాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడుదొడుకులతో సాగిన సూచీలు (Stock Market).. చివరకు స్తబ్దుగా ముగిశాయి. ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) కాసేపటికి 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఒక దశలో 77,445 కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు అత్యల్పంగా 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు