
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man Catches huge snakes trending video: సోషల్ మీడియాలో పాముల వీడియోలకు ఫుల్ గిరికి నెలకొందని చెప్పుకొవచ్చు.ప్రతి రోజు పాముల వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తాయి. చాలామంది పాముల్ని చూసి భయపడి పారిపోకుండా వాటి కదలికల్ని తమ ఫోన్ లలో రికార్డు చేస్తున్నారు. దీంతో కోబ్రాలు కొత్త కొత్త వీడియోలు వైరల్ గా మారాయి. వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి.అవి ఎక్కువగా ఎలుకల వేటలో మన ఇంట్లోకి దూరిపోతాయి. చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశాల్లో పాములు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం కొన్ని భారీ నాగుపాముల్ని ఒక వ్యక్తి పట్టుకున్నాడు. అతను ఏంచక్కా వాటిని అడవికి దగ్గరకు తీసుకెళ్లి డబ్బాల నుంచి బైటకు వదిలాడు. అవన్ని కూడా పడగ విప్పి అక్కడే ఉన్నాయి. చాలా సేపు కోపంతో పడగవిప్పి ఎటు పోకుండా ఉన్న చోటనే పాములు చుట్టుకుని పగడ విప్పి హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో నాగు పాములకు అతనేదో మీటింగ్ పెట్టుకున్నట్లు వాటిని చూస్తు ఏదో చెబుతున్నాడు. అవి కూడా పడగ విప్పి శ్రద్దగా వింటున్నాయి.
ఇంతలో అవి అక్కడ నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించాయి. కానీ దాదాపు ఐదారు నాగు పాములు మాత్రం చాలా కోపంతో అక్కడ కన్పిస్తున్నాయి. ఈ ఘటనను పక్కన ఉన్న వారు వీడియో తీశారు.
Read more: Leopard Video: వామ్మో.. ఇంట్లో దూరి గర్జనతో భయపెడుతున్న చిరుత పులి.. వీడియో వైరల్..
మరీ అతను పాముల్ని ఎక్కడెక్కడో కాపాడి తెచ్చి అడవిలో వదిలేస్తున్నాడో మరేంటో కానీ మొత్తంగా కోబ్రాలతో అతను చేస్తున్నఉప్పర్ మీటింగ మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెం విడ్డూరం ఆ రిస్క్ అవసరమా..?.. అంటూ ఫైర్ అవుతున్నారు.