
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Nothing Phone 4b Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) టెక్ తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. తన అద్భుతమైన ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో మార్కెట్లోకి మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ నథింగ్ ఫోన్ 4b (Nothing Phone 4b) పేరుతో మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది.. జూలై 7న భారత మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ అఫీషియల్ డిజైన్ లుక్‌ను కంపెనీ తాజాగా రివీల్ చేయడం విశేషం.. ఈ కొత్త మొబైల్‌కు సంబంధించిన డిజైన్, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ లుక్.. Nothing ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దాని వెనుక భాగంలో ఉండే ట్రాన్స్పరెంట్ డిజైన్.. నథింగ్ ఫోన్ (4b)లో కూడా కంపెనీ తన సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ రియర్ ప్యానెల్‌ను కొనసాగించిన్నట్లు తెలుస్తోంది.. ఈసారి అద్భుతమైన బ్లూ కలర్ ఆప్షన్‌తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో స్క్రూలతో పాటు ఇండస్ట్రియల్ యాక్సెంట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొబైల్‌కు ప్రీమియంతో పాటు క్లాసీ లుక్‌ను అందిస్తుంది.. ఎక్కువ సమయం ఫోన్ వాడినా చేతికి సౌకర్యవంతంగా ఉండేలా సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌ను అందించారు..
మెరిసిపోయే గ్లిఫ్ బార్.. ఈ నథింగ్ ఫోన్ (4b) ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన అడ్డంగా (Horizontal) ఉండే గ్లిఫ్ లైటింగ్ బార్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది నథింగ్ బ్రాండ్ ప్రత్యేకతగా ఉండబోతోంది.. నోటిఫికేషన్లు, కాల్స్ వచ్చినప్పుడు ఈ గ్లిఫ్ లైట్లు మెరుస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో ఎడమ వైపు పైభాగంలో ఓవల్ షేప్‌లో కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. దీనితో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, అదనపు సెన్సార్లను కూడా అందుబాటులో ఉంచారు..
బడ్జెట్ ధరలోనే B సిరీస్ ప్రారంభం.. నథింగ్ సంస్థ ఇప్పటివరకు ప్రీమియం సిరీస్‌తో పాటు బడ్జెట్ విభాగాల్లో a-సిరీస్ ఫోన్లను అందిస్తూ వచ్చింది. అయితే, ఈసారి మరింత మంది కస్టమర్లను ఆకర్శించేందుకు B సిరీస్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది a-సిరీస్ కంటే తక్కువ ధరలో, అంటే సుమారు రూ.25,000 బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్ అవ్వడం విశేషం..
ఇక లీక్ అయిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, నథింగ్ ఫోన్ (4b)లో అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 లేదా 7s జెన్ 4 చిప్సెట్ ప్రాసెసర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 8GB ర్యామ్‌తో పాటు 12GB ర్యామ్ వేరియంట్స్‌లో లాంచ్ కాబోతోంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే లాంగ్ లైఫ్ ఇచ్చే 5,400mAh బ్యాటరీని కూడా కలిగి ఉండడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ జూలై 7న జరిగే అఫీషియల్ లాంచ్‌లో దీని పూర్తి ఫీచర్స్‌తో పాటు ధర వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సంచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.