
హైదరాబాద్: రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బరిలోకి దిగింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
పవర్ ప్లేలో ఇన్నింగ్స్ నెమ్మదించకుండా కెప్టెన్ అభిరథ్ రెడ్డి (41*) దూకుడు ప్రదర్శించాడు. ఓ వైపు వికెట్లు పడినా.. భారీ షాట్లు కొట్టాడు. క్రీజ్‌లో అతడితోపాటు షణ్ముఖ (8*) ఉన్నారు.
అంతకుముందు మూడో ఓవర్లో వికాస్ రెడ్డి (3)ని పున్నయ్య ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ అన్విత్ రెడ్డి (4) కూడా ఔటయ్యాడు. కరియప్ప వేసిన బంతిని అన్విత్ షాట్‌కు యత్నించాడు. అయితే, బ్యాట్‌కు కాస్త పైన తగలడంతో బంతి మిడాఫ్‌లోకి వెళ్లింది. అక్కడ రాకేశ్ అద్భుతంగా డైవింగ్ చేసి క్యాచ్‌ను అందుకొన్నాడు. హైదరాబాద్ విజయానికి 14 ఓవర్లలో 138 పరుగులు అవసరం.
తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అవనీశ్ (53), ఆదిత్య జవ్వాజి (58) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆరోన్ జార్జ్ (35), తనయ్ త్యాగరాజన్ (31) విలువైన పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రణవ్ వర్మ 2.. షణ్ముఖ, అఖిల్ చెరో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - రంగారెడ్డి రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఫొటోలు మీరూ చూసేయండి..