
Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పోలీసింగ్ విధానాలు, నేర నియంత్రణ చర్యలపై సమగ్ర వివరాలను వెల్లడించారు. Read also: Tirupati District Pulse Polio: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి!
రాష్ట్రంలో నేరాల సంఖ్య గతంతో పోలిస్తే 14.1 శాతం మేర తగ్గిందని హోంమంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘా వ్యవస్థల వల్ల నేరాలను వేగంగా గుర్తించి అదుపు చేయగలుగుతున్నామని చెప్పారు.
లక్ష సీసీటీవీల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, ఇప్పటికే దాదాపు 70 శాతం మేర అమలు పూర్తైందన్నారు. నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసే స్థాయికి పోలీసు వ్యవస్థ చేరుకుందని పేర్కొన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని అనిత వెల్లడించారు.
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ‘శక్తి యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ యాప్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని, ఇప్పటికే 1.5 కోట్లకు పైగా డౌన్లోడ్లు నమోదయ్యాయని చెప్పారు. లైంగిక నేరాల కేసుల దర్యాప్తులో నాణ్యతను గణనీయంగా పెంచినట్లు హోంమంత్రి తెలిపారు.
గతంలో 31 శాతంగా ఉన్న దర్యాప్తు ప్రమాణాలు ప్రస్తుతం 90 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో 591 మంది నిందితులకు కోర్టుల ద్వారా శిక్షలు పడేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని వివరించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్ టీమ్’ విజయవంతంగా పనిచేస్తోందని అనిత తెలిపారు.
ఏపీ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని చెప్పారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు రూ.247 కోట్ల విలువైన సైబర్ మోసాల నగదును ఫ్రీజ్ చేయడంతో పాటు, 8 వేలకుపైగా అక్రమ ఆన్లైన్ కంటెంట్‌ను తొలగించినట్లు తెలిపారు. ప్రజల డిజిటల్ భద్రత కోసం మరిన్ని ఆధునిక చర్యలు చేపడుతున్నామని ఆమె స్పష్టం చేశారు.
Srisailam Temple Donation: శ్రీశైలం అన్నదానానికి దంపతుల భారీ విరాళం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Tirupati District Pulse Polio: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి!
Seshachalam crime: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష
Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్పై పోలీస్ స్టేషన్లో కేసు!
Tirupati Gangamma Temple: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మకు ఐదవ మరు పొంగళ్ళు
Kalyandurgam News: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో కూటమి విజయోత్సవం
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,366 గంజాయి కేసులు నమోదు చేసి, 986 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నార్కోటిక్స్ నియంత్రణలో అమలు చేస్తున్న