
మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.
జోనల్ ఇంఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు
.