
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పెంచుతున్న ఫీజులను అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించిన పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి.
రాజ్ నేతృత్వంలో విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సైఫాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు తక్షణమే 'ఫీజుల నియంత్రణ చట్టం' తీసుకురావాలని ఏబీవీపీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలు, హామీలు ఉన్నప్పటికీ, 2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్‌లోని అనేక పాఠశాలలు 20 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచేశాయని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. దీనికి తోడు పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు మండిపడ్డారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఇంతవరకు సమగ్ర చట్టం కార్యరూపం దాల్చలేదు.
ప్రభుత్వ