
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
The Suraka School: సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్ పాఠ్యాంశాలను ఒకే వేదికపై అందిస్తూ విద్యా సంస్థల్లో విశేష గుర్తింపు పొందిన ది సురాకా స్కూల్ - ఫ్యూచురా ఎక్సలెన్స్ తన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్తగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్ శివారులోని కొల్లూరు పాఠశాల ప్రాంగణంలో అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుని విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది.
భవిష్యత్‌కు అనుగుణమైన, విలువల ఆధారిత విద్యను అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ది సురాకా స్కూల్ యాజమాన్యం తెలిపింది. అట్టహాసంగా జరిగిన ఈ అకడమిక్ బ్లాక్ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరై అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాజీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ.. 'భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్య, విలువలు, ఆవిష్కరణ వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే విద్యా వాతావరణాన్ని సృష్టించారు' అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కలర్ పార్టీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాంపస్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాలు నిపుణుల శిక్షణను అందిస్తుంది.
ది సురాకా స్కూల్ – ఫ్యూచురా ఎక్సలెన్స్ అకాడమిక్ బ్లాక్ ప్రారంభం భవిష్యత్‌కు అనుగుణమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విలువల ఆధారిత బోధన, అనుభవాత్మక అభ్యాసం సమగ్ర వికాసం వైపు సంస్థ చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐసీఎల్ఎస్ అధికారి డాక్టర్ డి. విజయ భాస్కర్, ది వింటేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మద్ తాహిర్, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టీసీఎస్ హైదరాబాద్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వి. చెన్నారెడ్డి, హెక్సాగాన్ సీఈఓ భల్లవ్ ముండ్రా, వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అకడమిక్ డైరెక్టర్ మరుతీ రాంప్రసాద్ పెళ్లూరి హాజరయ్యారు.
డ్జోనియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 12 సంవత్సరాలకు పైగా విద్యారంగ అనుభవాన్ని కలిగి ఉన్న పాఠశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నిలోఫర్ షేక్ ఆధ్వర్యంలో పాఠశాల కొనసాగుతోంది. సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ షాహిద్ షేక్‌తోపాటు డైరెక్టర్లు సుభాష్ దాభాడే శ్యామ్ సుందర్ మోదాని మార్గదర్శకత్వంలో సురాకా పాఠశాల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. వారి తమ దూరదృష్టి, మార్గదర్శకత్వంతో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
సురాకా అంటే? సురాకా అనే పదం సంస్కృతంలో పవిత్ర జ్ఞానం అనే అర్థాన్ని సూచిస్తుంది. విద్యా ప్రావీణ్యం, ఆవిష్కరణ, వ్యక్తిత్వ వికాసం సమగ్ర అభివృద్ధి కలిసిన ఒక రూపాంతరాత్మక విద్యా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థకు సురాకా అనే పేరు పెట్టారు.
క్యాంపస్‌లో ప్రత్యేక సదుపాయాలు రోబోటిక్స్ ల్యాబ్, వండర్ ల్యాబ్, సుకూన్ ల్యాబ్
దరఖాస్తులు ప్రారంభం 2026–27 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈ, కేంబ్రిడ్జి ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌కు సిద్ధం చేసే.. విలువలతో కూడిన విద్యను కోరుకునే తల్లిదండ్రులు కొల్లూరులోని పాఠశాలను సందర్శించవచ్చు. క్యాంపస్ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్సైట్: సందర్శించవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రకటన మాత్రమే. ఇందులో సదరు సంస్థతోగానీ, ఈ వ్యవహారాల్లో కానీ జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి ప్రమేయం లేదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు కేవలం ప్రకటనగానే తీసుకుంటారని ఆశిస్తున్నాం)
ఇది విద్యార్థులకు