
‘‘లీక్ అయిన ప్రశ్నపత్రాలను కొంతమంది వినియోగదారులు టెలిగ్రామ్ వేదికగా పంచుకున్నారనే కారణంతో.. భారత ఐటీశాఖ వారం పాటు ఈ యాప్‌పై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకి కాకుండా.. భారత్‌లోని 15 కోట్లకుపైగా సాధారణ టెలిగ్రామ్ యూజర్లకు శిక్ష వేసినట్లుగా ఉంది.
లీక్ అయిన పరీక్ష మెటీరియల్‌ను, సంబంధిత అక్రమాల్లో భాగమైన వందలాది ఛానళ్లను తొలగించాం. తేదీలకు సంబంధించిన మోసాలను నివారించేందుకు ‘ఎడిటెడ్’ అనే లేబుల్‌ను కూడా మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాం. టెలిగ్రామ్ అనేది మంచికి దోహదపడే వ్యవస్థ.
తాత్కాలికంగానైనా దానిని నిషేధించడం పొరపాటే. అంతేకాక, ఈ నిషేధం దేన్నీ ఆపలేదు. సమాచార లీకేజీ ఇతర యాప్‌లకు మారుతుందంతే’’ అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. నీట్ రీటెస్ట్: వాట్సప్‌ను ఎందుకు వదిలేశారు..? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు టెలిగ్రామ్‌పై కేంద్రం ఈ మేరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
అలాగే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను భారత్‌లో డిసేబుల్ చేయాలని ఆదేశించింది. ఈ ఆంక్షల వల్ల చట్టబద్ధమైన యూజర్లకు అసౌకర్యం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో అత్యంత కీలమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.