
Vozinha: ఫిఫా ప్రపంచకప్‌లో అనామక జట్టైన కేప్ వెర్డె మాజీ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ స్పెయిన్‌ను నిలువరించి పెద్ద సంచలనం నమోదు చేసింది. మ్యాచ్ డ్రా అయినప్పటికీ కేప్ వెర్డె ఖాతాలో ఇది విజయం కిందే లెక్క. మ్యాచ్ డ్రా అయినప్పటికీ స్పెయిన్ వంటి బలమైన జట్టును తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో నిలువరించి అడ్డుగోడలా నిలబడ్డాడు వోజిన్హా.
ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను అడ్డుగోడలా అడ్డుకున్నాడు. ఫిఫా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వోజిన్హాకే మ్యాచ్‌లో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది
.