
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం అటు సేవా కార్యక్రమాలతోపాటు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్‌లో 2026 జూన్ 13న తానా మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన మహిళల త్రోబాల్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా జరిగింది.
ఎంతోమంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి పోటీల్లో పాల్గొంటున్న టీములకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని ఉత్సాహపరిచారు. ఈ టోర్నమెంట్‌ను తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు ప్రారంభించి, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ టీములకు అభినందనలు తెలియజేశారు.
ఈ టోర్నమెంట్లో 60 మందికి పైగా మహిళా క్రీడాకారిణులు పాల్గొనడంతో పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా మరియు హోరాహోరీగా సాగాయి. లీగ్ మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, మరియు ఫైనల్స్‌తో కూడిన ఈ టోర్నమెంట్లో అన్ని టీములు అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని, ప్రతిభను కనబరిచాయి.
మ్యాచ్‌లను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ, టోర్నమెంట్ సజావుగా సాగడానికి విశేష కృషి చేసిన మ్యాచ్ రిఫరీలు దీప్తి కోక మరియు చైతన్య కట్టాలకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రంజిత్ మామిడి, దీప్తి కోక మరియు చలం పావులూరిల అద్భుతమైన సమన్వయంతో, వారి అంకితభావం, కృషి వల్ల ఈ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది.
‘యూత్ వాలంటీర్ రాఫెల్ ప్రైజ’ విజేతలుగా నిలిచిన యువ వాలంటీర్లు కేతన్ మామిడి మరియు కార్తికేయ రావత్‌లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ టోర్నమెంట్ లో విజేతగా డ్రాగన్స్ టీము నిలిచింది. ఈ టీముకు చెందిన అనురాధ సౌందరరాజన్, రూబి ఈశ్వరమూర్తి, శేత్ర సంతానం, మధు మాగేష్, నందిని జనార్థనన్, దివ్యతేజస్విని తిరుమలశెట్టి, రీష్మా దొమ్మరాజు, ధివ్య కరుప్పన్, శ్వేత శ్రీగణేష్ విశేష
ప్రతిభతో విజేతగా నిలిచారు.
రన్నరప్ టీమ్ గా అల్టిమేట్ వారియర్స్ నిలిచింది. ఇందులో సుధ, అభి, కల్పన, భాను, మాలతి, తంగం, హుస్సేని, రంజని ప్రతిభను చాటారు.
ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన తానా మిడ్ అట్లాంటిక్ బృందానికి, ముఖ్యంగా సునీల్ కోగంటి, ప్రసాద్ క్రొత్తపల్లి, శ్రీధర్ సాదినేని, విశ్వనాథ్ కోగంటి, సురేష్ యలమంచి, ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్ గౌరి కర్రోతు మరియు ఇతర స్పాన్సర్లందరికీ తానా మిడ్ అట్లాంటిక్ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు.
విజేతలుగా నిలిచిన టీములకు తానా మిడ్ అట్లాంటిక్ ప్రతినిధులు నగదు బహుమతులు, ట్రోఫీలు మరియు పతకాలను అందజేశారు.