
హైదరాబాద్ నగరంలో మటన్ పేరుతో బీఫ్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని పలు హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరియు...
హైదరాబాద్ నగరంలో మటన్ పేరుతో బీఫ్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని పలు హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరియు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. వారి నుంచి సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు జూలై 1న ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఉస్మాన్ మీట్ షాప్ యజమాని మహ్మద్ ఉస్మాన్, అయాన్ బీఫ్ షాప్‌లో పనిచేసే మహ్మద్ జహంగీర్ పాషాలుగా నిందితులను గుర్తించారు. వీరు మటన్‌లో బీఫ్‌ను కలపడం లేదా బీఫ్‌నే మటన్‌గా నమ్మించి హోటళ్లకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి, ఈ కల్తీ మాంసం సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. గత నెల జూన్ 19న కూడా ఓ అక్రమ గోడౌన్‌పై దాడి చేసి, నిషేధిత రంగులు వాడి, పదేపదే వాడిన నూనెతో తయారు చేసిన చికెన్ వంటి 110 కిలోల కల్తీ ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో నగరంలోని హోటళ్లలో మాంసం నాణ్యతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.