
ఇంటర్నెట్‌డెస్క్: టిబెట్(Tibet) ఆక్రమణను చైనా (Tibet) వీడాలంటూ ఓ వ్యక్తి న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. సంప్రదాయ బౌద్ధ సన్యాసి వస్త్రాలను ధరించి..
టిబెట్‌ను చైనా వీడాలని రాసి ఉన్న కరపత్రాలను, టిబెట్ పతాకాన్ని పట్టుకుని తనకు తాను నిప్పంటించుకున్నాడు. మృతుడిని లోబ్గా రాంగ్జెన్ (52)గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఐరాసలో సమావేశాల షెడ్యూళ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకొంది. టిబెట్ (Tibet) నుంచి చైనా వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ 2009 నుంచి దాదాపు 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు, రైతులు అధికంగా ఉన్నారు. 2009లో యువ బౌద్ధ సన్యాసి ఆత్మహత్యతో ఇది మొదలైంది. దలైలామా తిరిగి టిబెట్‌కు రావాలని.. చైనా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని వారి ప్రధాన డిమాండ్లు. మరోవైపు ప్రవాస టిబెట్ నాయకులు వారిని రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారన్నది చైనా వాదన. 1951లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్‌ను ఆక్రమించుకుంది. 13వ శతాబ్ధం నుంచి టిబెట్ తమ దేశంలో భాగమని డ్రాగన్ వాదిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.