
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Andhra Pradesh Gold Mines: ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్లలో భారీగా బంగారం నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గనుల్లో ఉత్పత్తి ప్రారంభం చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బంగారుగనుల వేట మొదలైంది. శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కూడా ఖనిజాన్వేషణ జోరుగా సాగుతోంది. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులు సహాయంతో ఈ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది.
బంగారం అన్వేషణ జరిగే 4 కీలక దశలు.. భూమిలో బంగారు నిలవాలని గుర్తించి, మైనింగ్ ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు నాలుగు దశల ప్రక్రియను అనుసరిస్తారు.
G4 దశ (ప్రాథమిక పరిశీలన): తొలి దశలో అక్కడ మట్టి రాళ్లను పరీక్షించి బంగారం లభించే అవకాశం ఉందో లేదో నిర్ధారిస్తారు.
G3 దశ (నమూనాల సేకరణ): సగటున ప్రతి 400 మీటర్లకు ఒక బోర్వెల్ వేసి భూమి లోపల నుంచి నమూనాలను శాంపిల్స్ తీసి పరిశీలిస్తారు.
G2 దశ (విస్తృత అన్వేషణ): G3 ఫలితాలను సానుకూలంగా వస్తే మరింత స్పష్టత కోసం ప్రతి 200 మీటర్ల దూరం నుంచి ఒక బోర్వెల్ వేసి అన్వేషిస్తారు.
G1 దశ (మైనింగ్ అనుమతి): పూర్తి నివేదికల ఆధారంగా ఖనిజాల లీజులను కేటాయించి.. వాణిజ్యపరమైన మైనింగుకు అనుమతిస్తారు.
వివిధ జిల్లాల్లో బంగారు అన్వేషణ పురోగతి వివరాలు.. జౌకులు (శ్రీ సత్యసాయి జిల్లా) 5000 హెక్టార్లు నంబలపూలకుంట మండలం జౌకుల పరిధిలోని భూములను 1000 హెక్టార్లు చొప్పున 6 బ్లాక్‌లుగా విభజించారు. ఎఫ్ బ్లాక్ లో మెగా సోలార్ పార్క్ ఉండటంతో దాన్ని మినహాయించి, మిగిలిన ఐదు బ్లాక్ లలో అన్వేషణకు వివిధ ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
A-బ్లాక్: క్రిటికల్ మినరల్ ట్రాకర్స్ B-బ్లాక్: జంకో కటి ఎక్స్‌ప్లోరేషన్ C-బ్లాక్: బూస్లిప్ మైన్స్ అండ్ మినరల్స్ D-బ్లాక్: జెమ్స్ ప్రాజెక్ట్స్ E-బ్లాక్: జియో ఎక్స్ప్లోర్ ఈ సంస్థలు ఇచ్చే ప్రాథమిక నివేదిక ఆధారంగా జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తుంది.
రామగిరిలో 3740 హెక్టార్లు శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గతంలో ఎక్కడ భారత గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (AGML) గనులు ఉండేవి. వీటిని ఆనుకొని ఉన్న 2000 హెక్టార్లను ఉత్తర, దక్షిణ బ్లాక్‌లుగా విభజించి ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో G4 దశ అన్వేషణ చేపట్టనున్నారు.
అలాగే రొద్దం మండలం బొక్సాంపల్లి లోని ఉత్తర, దక్షిణ బ్లాక్‌లలోని 1,740 హెక్టార్లలో నిల్వలను గుర్తించగా.. ప్రస్తుతం జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో G3 దశ పరిశోధనలు జరుగుతున్నాయి.
చిగురుగుంటలో భారీ నిల్వలు.. చిత్తూరు జిల్లాలోని చిగురు గుంట ప్రాంతంలో భారీగా బంగారం నిల్వలు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చిగురుగుంటలో సుమారు 273 హెక్టార్లలో మొత్తం ఖరీజం సంపద అంచినా రెండు లక్షల టన్నుల మేర ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీని నాణ్యత 5.64 గ్రాముల అంటే టన్నుకు బంగారం నాణ్యత అన్నమాట. మొత్తం బంగారం నిలువలు 12,500 కేజీలు ఉండొచ్చు అని అంచనా. ఒకవేళ ఈ గని ఉత్పత్తిని ప్రారంభిస్తే ఏడాదికి సుమారు 600 కేజీల నుంచి 1000 కేజీల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ ఈ అన్వేషణలు సఫలీకృతమైతే.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ స్వర్ణ గనుల కేంద్రంగా మారే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.