
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Aaron Summers Jailed: మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్‌కు జైలు శిక్ష పడనుంది. 2018లో బిగ్‌బాష్ లీగ్ జరిగే క్రమంలో ఓ మైనర్ బాలికను లోబరచుకొని, లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరమైన వాటిని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సదరు క్రికెటర్ జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
గతంలో ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్లో హోబార్ట్ హరికేన్స్, టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు.. ఈ నేరాన్ని స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. 2018లో బిగ్‌బాష్ లీగ్ జరిగే సమయంలో ఓ 15 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పరుచుకొని.. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుందా.. అసభ్యకరమైన విషయాలను ప్రేరేపించినట్లు సదరు క్రికెటర్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
కోర్టు విచారణ ప్రకారం.. క్రికెటర్ సమ్మర్స్ హోబార్ట్ హరికేన్స్ జట్టులో ఉన్నప్పుడు ఈ నేరాలు జరిగాయి. ఈ సంఘటన జరగడానికి ముందు సమ్మర్స్ సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని సంప్రదించాడని టాస్మానియా సుప్రీంకోర్టు విచారణలో వెల్లడైంది.
విచారణ సందర్భంగా.. సమ్మర్స్ తరఫు న్యాయవాది కరోలిన్ గ్రేవ్స్, అతను సామాజికంగా ఒంటరిగా ఉంటూ, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన కాలంలో ఈ నేరాలు జరిగాయని వాదించారు. అప్పటి నుండి సమ్మర్స్ తన చర్యల గురించి పునరాలోచించుకున్నాడని, మళ్లీ నేరం చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించే ఆరోన్ సమ్మర్స్.. ఆ సమయంలో అంతర్జాతీయ ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని భావించారు. "నేరం జరిగిన సమయంలో, అతను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు, అందుకే అతన్ని అంతర్జాతీయంగా ఆడటానికి ఎంపిక చేశారు" అని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. "ఆస్ట్రేలియాలో గానీ, విదేశాలలో గానీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తాను ఎప్పటికీ అడుగుపెట్టలేనని అతనికి తెలుసు" అని ఆమె జోడించారు.
2021లో బాలల దుర్వినియోగ సామగ్రిని కలిగి ఉండటం, ప్రసారం చేయడంతో సహా వేర్వేరు బాలల లైంగిక దోపిడీ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించిన తర్వాత, సమ్మర్స్ గతంలో నార్తర్న్ టెరిటరీలో జైలు శిక్ష అనుభవించాడు. అతని న్యాయవాది శిక్షను వాయిదా వేయాలని కోరారు. కానీ న్యాయమూర్తి హెలెన్ వుడ్ అది సాధ్యం కాదని సూచించారు. బెయిల్‌పై ఉన్న సమ్మర్స్‌ను కస్టడీకి అప్పగించగా.. అతడికి ఆగస్టులో అతనికి శిక్ష విధించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.