
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Pakistan bus crash 40 killed 8 injured: పాకిస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. నైరుతి రాష్ట్రమైన బలూచిస్తాన్‌లో రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయలోకి బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 40 మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అక్కడ శవాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా అంబులెన్స్ లు అక్కడకు చేరుకున్నాయి.గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చనిపోయిన వారి శవాల్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
శుక్రవారం నాడు నైరుతి పాకిస్థాన్‌లో .. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఒక ప్రయాణికుల బస్సు షేరానీ-ఝోబ్ హైవేపై అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. చనిపోయిన 40 మందిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.
Read more: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. మహదేవుని దర్శనానికి భద్రత నడుమ మొదటి బృందం పయనం..!
ఈ క్రమంలో ప్రమాదం జరిగినప్పుడు బస్సులో పాడైపోయిన మరోక బస్సులోని ప్రయాణికులు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అందుకే బస్సు కిక్కిరిసిపోయి ఉందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పాక్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.