
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man bathing snake with shampoo and soap video: కోబ్రాల వీడియోలు ప్రతిరోజు నెట్టింట బాగా వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలను చూసేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాములు కన్పిస్తే చాలా మంది స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందిస్తున్నారు. అనవసరంగా పాములకు హనీ కల్గించకూడదని భావిస్తున్నారు. కానీ కొంత మంది దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. పాములు కన్పించగానే వాటితో ఫోటోలు, వీడియోలు తీయడం చేస్తున్నారు. వాటికి ఇరిటెట్ తెప్పిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న పనులతో కాటులకు కూడా బలౌతున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. ఒక వ్యక్తి మాత్రం పామును పట్టుకుని ఏంచక్కా సబ్బు, షాంపు పెట్టి మరీ స్నానం చేయిస్తున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో ఒక వ్యక్తి స్నానం చేస్తున్నాడు. అతను తన చేతిలో ఒక పొడవైన కోబ్రాను పట్టుకుని దానికి సబ్బు, షాంపు పెట్టి నీట్ గా వాష్ చేస్తున్నాడు.
అతను చేస్తున్న పనిని అందరు వింతగా చూస్తున్నారు. అదేదో మనిషి ఒంటికి సబ్బుపెట్టి ఏవిధంగా అయితే స్నానం చేయిస్తారో అచ్చం అదే విధంగా సదరు వ్యక్తి సైతం పాముకు శుభ్రంగా స్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more: Snake Video: ఓర్నాయనో.. అమ్మాయిని చూసి సుస్సు పోసుకున్న నాగు పాము.. కనీసం పడగ విప్పి చూడకుండా.. ఫన్నీ వీడియో వైరల్...
మరికొంత మంది మాత్రం అదేమన్నా పెంపుడు జంతువా..?.. పొరపాటునకాటు వేస్తే సిట్యువేషన్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టంట్ లో లైఫ్ ను డెంజర్ లో పడేసుకొవద్దని సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా కోబ్రా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.