
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Indonesia Couple Kiss Video: ఇండోనేషియాలో ఓ నిర్ఘాంతపోయే సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఓ పెళ్లి కాని జంట టిక్‌టాక్ యాప్‌లో ముద్దులు పెట్టుకునే వీడియో ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఆ కారణంగా ఆ జంటకు 21 సార్లు కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఈ విషయం ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచే అనే ఇండోనేషియాలోని ఒక సంప్రదాయవాద ప్రావిన్స్. ఇక్కడ నివసిస్తున్న ఒక యువ జంట కొన్ని నెలల క్రితం టిక్‌టాక్ లైవ్ క్రియేట్ చేసి అందులో ముద్దు పెట్టుకున్నారు. ఫలితంగా వారు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గత వారంలో ఒక ఇస్లామిక్ షరియా కోర్టుచే బహిరంగంగా కొరడా దెబ్బలు తిన్నారు.
అయితే ఇండోనేషియా దేశంలో పెళ్లి కాకుండా జంట ముద్దు పెట్టుకోవడం పెద్ద నేరంగా పరగణిస్తారు. అయితే టిక్‌టాక్ లైవ్‌లో ఈ విధంగా ముద్దులు పెట్టుకున్న ఆ జంటకు.. నగర షరియా కోర్టు వారిద్దరికీ చెరో 21 సార్లు కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది. ఆచే నగరంలోని బుస్తానుసలాదిన్ పార్కులో ఇలాంటి శిక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై.. ముసుగులు ధరించిన బృందం ఆ ప్రేమ జంటను పబ్లిక్‌గా కొరడాలతో కొట్టింది. ఈ చర్యను కనీసం 100 మంది చూశారని స్థానికులు చెబుతున్నారు. అలా చూడటమే కాకుండా వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది.
టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకుంటూ పట్టుబడిన ఆ జంట వయసు వరుసగా 25, 22 సంవత్సరాలు. వారిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరిలో టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత షరియా అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో ఏప్రిల్‌లో వారిని అరెస్టు చేశారు. ఈ టిక్‌టాక్ లైవ్ వీడియో ఉన్న సెల్ ఫోన్, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్‌ను కోర్టు సాక్ష్యంగా స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
న్యాయస్థానం మొదట ఆ జంటకు చెరో 25 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయితే, ఆ నేరానికి గాను ఇద్దరూ అప్పటికే నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించినందున, ఆ 25 కొరడా దెబ్బలను 21కి తగ్గించింది.
ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసే ఏకైక ప్రావిన్స్ ఆచే అని అంటారు. వేర్పాటువాద యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన 2006 శాంతి ఒప్పందంలో భాగంగా, ఆ దేశ లౌకిక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రావిన్స్‌కు మతపరమైన చట్టాలను అమలు చేసే హక్కును మంజూరు చేసింది. పైన పేర్కొన్న ఆచే ప్రావిన్స్ జనాభాలో 1% ఉన్న ముస్లిమేతరులను కూడా చేర్చడానికి ఈ చట్టాన్ని 2015లో విస్తరించారు.
శిక్ష ఇంకా దేనికి ఉంటుంది? పైన పేర్కొన్న చట్టం వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం వంటి విషయాలను అనైతిక నేరాలుగా పరిగణిస్తుంది. అటువంటి నేరాలకు 100 కొరడా దెబ్బల వరకు శిక్ష విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. 2025లో బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నందుకు ఇద్దరు పురుషులకు కొరడా దెబ్బలు వేశారు. అదేవిధంగా మద్యం సేవించేవారికి, జూదం ఆడేవారికి, శుక్రవారం ప్రార్థనలకు హాజరుకాని పురుషులకు ఈ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు.
మానవ హక్కుల ఉల్లంఘన.. ఇండోనేషియాకు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆచే ప్రావిన్స్‌లో పిల్లలను బహిరంగంగా కొరడాతో కొట్టడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఖండించింది. దీనిని క్రూరమైన, అమానుషమైన శిక్షగా అభివర్ణించింది. దీనిని రద్దు చేయడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందానికి కూడా ఈ సంస్థ మద్దతు తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.