
Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారు
లు తిరిగి బంగారం, వెండి వైపు ఆకర్షితులయ్యారు.
అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడం వంటివి బంగారం ధరలకు మద్దతునిచ్చాయి. గణాంకాల ప్రకారం, బంగారం ధరలు 1.63% పెరిగి, ఔన్సుకు $69.20 చేరి, $4,194 కు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా 2.83% పెరిగి, ఔన్సుకు $62.790 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
తాజాగా శుక్రవారం 11గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా రూ.3,220 వరకు పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,950 వరకు ఎగబాకింది. అదే వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు పెరిగింది.
ఇక ధరలు పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000 రూపాయల వద్ద ట్రేడవుతుంగా, అదే 22 క్యారెట్ల ధర 1,34,750 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బంగారంతో పాటు, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు 2% కంటే ఎక్కువగా పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా దాని ధరలు పెరిగాయి. ఇదిలా ఉండగా, భారతదేశంలో వెండి ధరలు కిలోగ్రాముకు సుమారుగా 2.50,000 వరకు చేరుకుంది. ఇది ముందు రోజుతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.