
అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఏళంజి గ్రామం వద్ద ఉన్న సత్యసాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు గండిపడి తాగు నీరంతా వాగులోకి ప్రవహిస్తోంది.
© 2026 nimisham.in

అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఏళంజి గ్రామం వద్ద ఉన్న సత్యసాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు గండిపడి తాగు నీరంతా వాగులోకి ప్రవహిస్తోంది.
బొమ్మనహళ్: అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఏళంజి గ్రామం వద్ద ఉన్న సత్యసాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండిపడి తాగు నీరంతా వాగులోకి ప్రవహిస్తోంది. ఈ ట్యాంక్‌ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ట్యాంక్‌కు లైనింగ్ పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీ కాలువ సమీపంలో ఉన్నందున విద్యుత్తు మోటార్లతో కాలువ నీటిని ట్యాంకులోకి పంపిణీ చేస్తున్నారు. అయితే లైనింగ్ కూలిపోవడంతో గండిపడినట్లు సమాచారం. సత్యసాయి తాగునీటి ట్యాంకు అధికార బృందం పరిశీలించి, మరమ్మతు పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చి తాగునీటిని నిల్వచేసి గ్రామాలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







