
ఈనాడు, అమరావతి : వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నగరాల సుందరీకరణ, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావించింది. పనికిరాని ఇనుప సామాను, పాత వాహనాల విడిభాగాలు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, టైర్లు, పారిశ్రామిక వ్యర్థాలను వినియోగించి అందమైన శిల్పాలు, కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. వ్యర్థాలతో రూపొందించిన బొమ్మలతో విజయవాడలోని బందరు కాలువ గట్టు ఆకర్షణీయంగా మారింది. కొంతకాలం క్రితమే వీటిని ఏర్పాటుచేసినా పిచ్చిమొక్కలు పెరగటంతో బొమ్మలు కనిపించేవి కాదు. ఇటీవల పిచ్చిమొక్కలను తొలగించటంతో ఈప్రాంతం సుందరంగా కనిపిస్తోంది. సుమారు 20 సిలిండర్లతో తయారైన గెరిల్లా బొమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. బొమ్మల నిర్వహణ బాధ్యతలను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భుజానికెత్తుకుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





