
అమరావతి: సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu )బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. డీజీపీ సైబర్‌ సెక్యూరిటీ సెల్‌తో సమన్వయం చేసుకుని, సైబర్‌ నేరాలను అరికట్టేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గత ఎస్ఎల్‌బీసీ సమావేశంలో ప్రస్తావించిన 13 అంశాల్లో.. ఇంకా నాలుగు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని బ్యాంకర్లు వివరించారు. ఆరు నెలలు గడిచినా పూర్తి చేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రతి అర్హుడికి బ్యాంకింగ్‌సేవలు అందేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైభవంగా దేవదేవుడి హంసవాహన సేవ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం తిరుమలలోని ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియంను ప్రారంభించారు. మ్యూజియంలో 9 గ్యాలరీలు, 14 వేల కళాఖండాలు ఉన్నాయి. శ్రీవారి ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలను తెలిపేలా వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారి కిరీటాలు, ఆభరణాలు త్రీడీ మోడల్‌లో చిత్రీకరించి ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాల ప్రదర్శనను సీఎం ఈ సందర్భంగా తిలకించారు. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రెండో రోజు పర్యటించారు. తిరుమలలో (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.