
Ap Govt Restored Residence Certificate Issuance To Tahsildar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను పునరుద్ధరించారు. ఈ మేరకు జీవో నంబర్ 592ను ప్రభుత్వం జారీ చేసింది. ఉద్యోగాలు, విద్య, ఆధార్ నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం ప్రజలకు నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 2015లో జారీ చేసిన జీవో 581ను రద్దు చేశారు.





