
కృత్రిమ మేధ (artificial intelligence) మోడళ్లు తమ పరిధి దాటి పనిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఆరు ఆందోళనకర ఘటనలను ఓపెన్ఏఐ (OpenAI) గుర్తించింది.
© 2026 nimisham.in

కృత్రిమ మేధ (artificial intelligence) మోడళ్లు తమ పరిధి దాటి పనిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఆరు ఆందోళనకర ఘటనలను ఓపెన్ఏఐ (OpenAI) గుర్తించింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence) మోడళ్లు తమ పరిధి దాటి పనిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కొన్ని ఆందోళనకర ఘటనలను ఓపెన్‌ఏఐ (OpenAI) బయటపెట్టింది. గత కొన్ని నెలల్లో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో, వాటి పనితీరును పరీక్షిస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. ‘‘ఇంకా విడుదల కాని ఓ ఏఐ (AI) మోడల్‌.. తనకు తానే సాధారణ నియమాలను పట్టించుకోవద్దంటూ సూచనలు రాసుకుంది. ఇతర చాట్‌బాట్‌లకు ఉన్న నియంత్రణల నుంచి బయటపడాలని పేర్కొంది. మరో ఘటనలో వినియోగదారుడి అనుమతి లేకుండానే ఏఐ మోడల్‌ కొన్ని ఫైళ్లను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసింది. చేసిన తప్పులను దాచేందుకు భవిష్యత్తు మోడల్స్‌కు సూచనలు ఇచ్చింది. అంతేగాక, సొంతంగా సీక్రెట్ మెసేజ్ బోర్డులను వాడుకోవడం.. పబ్లిక్ వెబ్‌సైట్లలో ఫైల్ షేరింగ్ చేయడం వంటివి గుర్తించాం’’ అని ఓపెన్‌ఏఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఏఐ మోడళ్లు మనుషుల అనుమతి లేకుండా ఏమైనా చేస్తున్నాయా? ఇతర ఏఐ మోడళ్లతో కలిసి.. వాటిపై ఉన్న నియంత్రణలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయా? అనే అంశాలను ఇకపై మరింత నిశితంగా పరిశీలించనున్నట్లు ఓపెన్‌ఏఐ ఈ సందర్భంగా పేర్కొంది. తమ ఏఐ మోడళ్లు కూడా టెస్టింగ్‌ సమయంలో మూడు సంస్థల వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు ఆంథ్రోపిక్‌ (Anthropic) సంస్థ ఇటీవల తెలిపింది. ఇదిలా ఉండగా.. కృత్రిమ మేధ గురించి ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐకి ఈ ప్రపంచం భయపడటం సమంజసమేనన్నారు. ‘‘ఏఐ ఎలా విఫలం కాగలదో ఇప్పటినుంచే ఊహించాల్సిన అవసరం లేదు. అయితే, భయం కలిగి ఉండటం మంచిదే. భవిష్యత్తులో ఏఐ మోడళ్లు (AI MODELS) కొన్ని విషయాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం, తెలివితేటలు కలిగి ఉండబోతున్నాయి. ఆ మార్పు ఇప్పటికే మొదలైంది. ఏఐ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉండాలి. అందుకు అనుగుణంగా వ్యవహరించడం మా బాధ్యత. ఏఐ సామర్థ్యం రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళనలకు దారితీస్తోంది. దానిపై మనషుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల్సిందే’’ అని ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







