
100 నగరాలు, పట్టణాల్లో 3,942కి చేరిన సంఖ్య ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజనతో వాటి సంఖ్య 820 వరకు పెరిగింది. 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న 3,122 డివిజన్లు, వార్డుల సంఖ్య 3,942కి పెరిగింది. ఈ మేరకు పుర కమిషనర్లు పెరిగిన డివిజన్లు, వార్డుల సంఖ్యపై మంగళ, బుధవారాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనకు ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితాలను ప్రకటించారు. మరో 23 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కోర్టు కేసులు పరిష్కారమయ్యాక వాటిల్లోనూ పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





