
రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్ స్పందించింది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఈ కొత్త చట్టం వల్ల జరిమానాలుగా 100శాతం సుంకాలను విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. దీనిపై భారత్ స్పందిస్తూ దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి న్యూదిల్లీ కట్టుబడి ఉందని పేర్కొంది. వైవిధ్యభరితమైన వనరుల సేకరణ ద్వారా చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపింది.




