
జట్టులోకి రావడం.. గాయపడడం.. కొంత విరామం తర్వాత పునరాగమనం చేయడం.. వెంటనే గాయపడడం.. టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వ్యవహారమిది. ఐపీఎల్లో గాయపడ్డాక కొన్ని నెలల విరామానంతరం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అతను.. గాయంతో ఆ సిరీస్ నుంచి అర్ధంతరంగా వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే.
జట్టులోకి విప్రాజ్‌ నిగమ్‌ దిల్లీ: జట్టులోకి రావడం.. గాయపడడం.. కొంత విరామం తర్వాత పునరాగమనం చేయడం.. వెంటనే గాయపడడం.. టీమ్‌ఇండియా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వ్యవహారమిది. ఐపీఎల్‌లో గాయపడ్డాక కొన్ని నెలల విరామానంతరం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన అతను.. గాయంతో ఆ సిరీస్‌ నుంచి అర్ధంతరంగా వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై అతను మళ్లీ బరిలోకి దిగింది ప్రస్తుత అఫ్గాన్‌ సిరీస్‌లోనే. అయితే ఒక్క మ్యాచ్‌ ఆడాడో లేదో.. మళ్లీ గాయం కావడంతో రెండో టీ20లో ఆడలేదీ తమిళనాడు స్పిన్నర్‌. అతను ఈ సిరీస్‌కే కాదు.. రాబోయే ఆసియా క్రీడలకు కూడా దూరం అయ్యాడు. ఈసారి పక్కటెముకల గాయం వరుణ్‌ను ఆటకు దూరం చేసింది. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు. ఈ నెల 18న మొదలయ్యే ఆసియా క్రీడల కోసం వరుణ్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ ఎంపికయ్యాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





