
BCCI Chief Selector! ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం పొడిగింపు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అక్టోబర్ 4తో ఆయన పదవీకాలం ముగియనుంది. శుక్రవారం జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే అజిత్ అగార్కర్‌ను సెలక్టర్‌గా మరింత కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే అతడు పొడిగింపులోనే ఉన్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్‌ టోర్నీకి ఇంకా ఏడాది సమయం ఉండటంతో.. కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయడానికి ఇది సరైన సమయమని బోర్డు భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించినప్పుడే అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నారని.. బీసీసీఐ ఏజీఎంలో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టకాటకా.. టెక్‌బాల్‌! ఒకవేళ అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లభించకపోతే.. చీఫ్ సెలక్టర్‌గా (BCCI Chief Selector) ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్‌, ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఐపీఎల్ ( IPL ) విన్నింగ్ టీమ్‌ సభ్యులు. అంతేకాకుండా.. ప్రజ్ఞాన్ ఓఝా ఇప్పటికే సెలక్షన్ కమిటీలో మెంబర్. అలాగే ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు. 40 ఏళ్ల ఓఝా ఒడిశాకు చెందినప్పటికీ.. అతడు హైదరాబాద్‌ తరఫున క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇక గుజరాత్‌కు చెందిన పార్థివ్ పటేల్ ఐపీఎల్‌లో పలు జట్లకు కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు ఇప్పుడు సందిగ్ధంలో పడింది.