
Pakistan U-19: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ అండర్-19 జట్టు 200 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత 350 పరుగులు చేసిన పాక్, ఇంగ్లాండ్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాక్ యువ ఆటగాళ్లు అదరగొట్టారు.





