
మందమర్రి పట్టణం: మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనిలో బుధవారం మరోసారి ప్రమాదం సంభవించింది. గని లోపల 3వ సీమ్ 16వ లెవెల్ వద్ద పైకప్పు అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోవడంతో తీవ్రమైన ఎయిర్ బ్లాస్ట్ జరిగింది. ఈ గాలి ఒత్తిడి కారణంగా 12వ లెవెల్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి, శశి కుమార్, రాజశేఖర్ గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, అధికారులు స్పందించి క్షతగాత్రులను గని పైకి తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధిత కార్మికులను జీఎం రాధాకృష్ణతోపాటు అధికారులు, కార్మిక సంఘం నాయకుడు పరామర్శించారు. రెండు రోజుల వ్యవధిలో వరసగా రెండు ప్రమాదాలు జరగడంతో కార్మికుతు ఆందోళన గురవుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





