
Andhra Pradesh weather Today: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 19 నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 3,4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు.





